વિકિપીડિયા:Subpages: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Jasper Deng (ચર્ચા | યોગદાન) |
ఈయెమ్మెస్ నంబూద్రిపాద్ |
||
લીટી ૧:
{{ భారత రాజకీయ నాయకుడు
| పేరు = ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్
| image = E. M. S. Namboodiripad.jpg
| caption = ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్
| birth_date ={{పుట్టిన రోజు|1909|6|13|df=y}}
| birth_place =[[Perintalmanna|పెరిందాళ్ మన్న]], [[Malappuram|మలప్పురం]], [[Madras Presidency|మద్రాస్ ప్రాంతం]], [[బ్రిటిష్ ఇండియా]]
| death_date = {{death date and age|df=yes|1998|3|19|1909|6|13}}
| death_place = [[Thiruvanthapuram|తిరువనంతపురం]], [[Kerala|కేరళ]], [[India|ఇండియా]]
| residence = A house rented for him by the Communist party in Kerala's capital, Thiruvanthapuram
| office = [[Chief Minister of Kerala|కేరళ ముఖ్యమంత్రి]]
| term_start = 5 ఏప్రెల్ 1957
| term_end = 31 జులై 1959
| term_start2 = 6 మార్చి 1967
| term_end2 = 1 నవంబరు 1969
| constituency =
| party =[[Communist Party of India (Marxist)|సిపిఎమ్]]
| spouse = ఆర్యా అంతర్జనం
| religion =[[Atheism|నాస్తిక]]
| children =ఇరువురు కుమారులు, ఇరువురు కుమార్తెలు.
| blank1 = Source
| data1 =[http://www.keralacm.gov.in/ems.htm Government of Kerala]
}}
'''ఈయెమ్మెస్''' అనే పొట్టిపేరుతో ప్రసిద్ధికెక్కిన '''ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్''', (13 జూన్ 1909 – 19 మార్చ్ 1998), భారత దేశ చరిత్ర లోనే చెప్పుకోదగ్గ గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు, సాంఘిక-మార్క్స్ వాద సూత్ర బద్ధుడు, విప్లవవాది, రచయిత, చరిత్రకారుడు, సాంఘిక విమర్శకుడే కాక, [[Kerala|కేరళ]] రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్య మంత్రి కూడాను. [[Indian National Congress|కాంగ్రెస్ పార్టీ]] బయటివాడైన [[Chief Minister (India)|ముఖ్యమంత్రి]] గా [[Republic of India|గణ తంత్ర భారత దేశం]] లో ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వ నాయకుడీయన.
ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్ [[Kerala state|కేరళ]] లో శ్రీకారం చుట్టిన మౌలికమైన భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలను అనుకరించే ప్రయత్నాలు ఈ నాటికి ఇతర భారతీయ రాష్ట్రాలలో జరుగుతూనే ఉన్నాయి. మార్క్స్ వాద కమ్యూనిస్ట్ పార్టీ [[politburo|ఆచరణా సమితి]] సభ్యుడిగా, 14 యేళ్ళ పాటు ప్రధాన కార్యదర్శిగా ఈయన తీసుకున్న చొరవ, ముందుచూపు గల నిర్ణయాలవలనే ఆ పార్టీ ఈనాడు జాతీయ స్థాయి సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలను ప్రాభావితం చేయగలిగే ప్రముఖమైన రాజకీయ పక్షంగా ఎదిగిందనడం లో అతియోశక్తి లేదు.
== వ్యక్తిగత జీవితం ==
ఏలాంకుళం మనక్కళ్ శంకరన్ నంబూద్రిపాద్ 13 జూన్ 1909 నాడు, ప్రస్తుత [[Malappuram district|మలప్పురం జిల్లా]] పెరింతాళ్ మన్న తాలూకా [[Elamkulam|ఏలాంకుళం]] గ్రామంలోని కులీన అగ్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.వీరి తండ్రిగారి పేరు పరమేశ్వరన్ నంబూద్రిపాద్. చిన్న వయసులోనే ఈయన వి.టి.భట్టాద్రిపాద్ మొదలయిన పెద్దవారికి చేయూతగా, కేరళ [[Namboothiri|నంబూద్రి]] కుటుంబాలలో పాతుకుపోయిన [[casteism|కులవివక్ష]], [[conservatism|ఛాందసవాద]] ధోరణులకు వ్యతిరేకంగా పోరాడారు. చదువుకునే రోజుల్లో [[Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]] తో సహచర్యంతో [[Indian Independence Movement|స్వాతంత్ర్య సంగ్రామం]] లో తీవ్ర కృషి చేసారు.
ఈయన వ్రాసిన పలు గ్రంథాలలో '''కేరళ చరిత్ర''' అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.<ref>[[రామచంద్ర గుహా]], ''[[గాంధీ పిమ్మటి ఇండియా]]'', p 294</ref>
==
1934 లో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లో సామ్యవాద పక్షంగా తలయెత్తిన [[Congress Socialist Party|కాంగ్రెస్ సామ్యవాద పక్షం]] ఆద్యులలో ఈయెమ్మెస్ ఒకరు. ఈ పార్టీ అఖిల భారత సహకార్యదర్శి గా 1934 నుంచి 1940 వరకు పనిచేసి, 1939 అదే హోదాలో మద్రాస్ విధాన సభ కు కూడ ఎన్నికైనారు.
[[socialist|సామ్యవాద]] ఆదర్శాలకు నిబద్ధుడైన ఈయెమ్మెస్ లోని పీడితప్రజల పట్ల గల సానుభూతి ఆయనను కమ్యూనిస్ట్ ఉద్యమం కేసి ఆకర్షించింది. [[Communist Party of India|భారత కమ్యూనిస్ట్ పార్టీ]] ని కేరళ లో స్థాపించిన వారిలో ముఖ్య పాత్ర పోషించినందుకు కొంతకాలం అజ్ఞాతవాసంలోకి కూడా వెళ్ళవలసి వచ్చింది. 1962 [[Sino-Indian war|భారత చైనా యుద్ధం]] లో, కమ్యూనిస్ట్ చైనా దృక్పథాన్ని బలపరచి వివాదాస్పదుడైనాడు ఈయెమ్మెస్. 1964 లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయినప్పుడు ఈయన [[Communist Party of India (Marxist)|మార్క్స్ వాద కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఎమ్)]] వైపు మొగ్గు జూపారు. సిపిఎమ్ ఆచరణా సమితి (Politburo) కేంద్రీయ సభ్యుడిగా మొదలుపెట్టి తన జీవితాంతం కొనసాగిన నంబూద్రిపాద్,1977 లో సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి గా పదవిని చేబట్టి 1992 వరకు ఆ బాధ్యతలను నిర్వహించారు. విశిష్టమైన మార్క్సిస్ట్ సూత్రవేత్తగా పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాంఘిక మేధావి ఈయెమ్మెస్ నంబూద్రిపాద్ ముందుచూపుకు, నిజాయితీనిబద్ధతలకు కేరళ సాధించిన అభివృద్ధే తార్కాణం. ఈ నాటికీ కేరళలో ఈయన పేరు,ఒకప్పటి ఈయన ప్రభుత్వ పనితీరుల గుఱించి దినదినం గొప్పగా చెప్పుకుంటూనే ఉంటారు.
== రాష్ట్ర ప్రభుత్వ ఎన్నిక ==
{{Indcom}}
1957 మొట్టమొదటి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలలో[[Communist Party of India|కమ్యూనిస్ట్]] పార్టీ కి విజయం సాధించిన నంబూద్రిపాద్ ప్రపంచంలోనే "ఎన్నికైన కమ్యూనిస్ట్" నాయకులలో ఆద్యుడైనాడు. భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పక్షం రాష్ట్రస్థాయిలో గెలుపొందటంకూడా ఇదే ప్రథమం. 5 ఏప్రిల్ 1957 నాడు ఈయెమ్మెస్ కేరళ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి, త్వరలోనే [[Land Reform Ordinance|భూ సంస్కరణల చట్టాన్ని]],[[Education Bill|విద్యా చట్టాన్ని]] తీసుకువచ్చారు. వివాదాస్పదమైన పరిస్థితుల్లో 1959 లో కేంద్ర ప్రభుత్వం [[president's rule|356 వ ప్రకరణం]] ఉటంకిస్తూ ఈయన ప్రభుత్వాన్ని కూల్చివేసింది.
1967 లో రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి నంబూద్రిపాద్ ముస్లిమ్ లీగ్ తో సహా 7 పార్టీల మద్దతు స్వీకరించారు. తన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ముస్లిముల కోసం ప్రత్యేక 'మలప్పురం' జిల్లా ఏర్పాటు చేసి ,'స్వార్థ రాజకీయ వేత్త' అన్న విమర్శలకు పాలయ్యారు.
ఈయెమ్మెస్ [[Kerala Legislative Assembly|కేరళ శాసన సభ]] కు 1960-64, తిరిగి 1970-77 కాలంలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. ([[People's Plan|ప్రజల యోజన]]) ద్వారా కేరళ లో అధికార, వనరుల వికేంద్రీకరణకు, అక్షరాస్యతా ఉద్యమానికి కృషి చేసారు. ఆంగ్ల, మలయాళ భాషల్లో అనేక పుస్తకాలు రచించిన నంబూద్రిపాద్ పత్రికా విలేఖరిగా కూడా సుపరిచితుడే.
== మృతి ==
నంబూద్రిపాద్ 19 మార్చి 1998 న మరణించారు. ఈయన భార్య పేరు ఆర్యా అంతర్జనం. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు.
== సంప్రతులు ==
{{Reflist}}
==బయటి లంకెలు ==
{{commonscat-inline}}
*[http://www.keralacm.gov.in/ems.html కేరళ ముఖ్యమంత్రి అధికారిక జాలపుట లో నంబూద్రిపాద్]
{{s-start}}
{{s-bef|ముందరి=(ఖాళీ)}}
{{s-ttl|title=[[Chief Minister of Kerala| కేరళ ముఖ్యమంత్రి ]]
|కాలం=1957–1959}}
{{s-aft|తదుపరి=[[Pattom Thanupillai]]}}
|-
{{s-bef|ముందరి=[[R. Sankar]]}}
{{s-ttl|title=[[Chief Minister of Kerala| కేరళ ముఖ్యమంత్రి ]]
|కాలం=1967–1969}}
{{s-aft|తదుపరి=[[C. Achutha Menon]]}}
{{end}}
{{Authority control|VIAF=45546717}}
{{Persondata <!-- Metadata: see [[Wikipedia:Persondata]]. -->
| NAME = Namboodiripad, E. M. S.
| ALTERNATIVE NAMES =
| SHORT DESCRIPTION = Indian politician
| DATE OF BIRTH = 13 June 1909
| PLACE OF BIRTH = [[Perinthalmanna]], [[Madras Presidency]], [[British Raj|British India]]
| DATE OF DEATH = 19 March 1998
| PLACE OF DEATH =
}}
{{DEFAULTSORT:Namboodiripad, E. M. S.}}
[[Category:
[[Category:
[[Category:
[[Category:Politics of Kerala]]
[[Category:Communist Party of India (Marxist) politicians]]
[[Category:Indian politicians]]
[[Category:Malayali politicians]]
[[Category:Indian atheists]]
[[Category:St. Thomas College, Thrissur alumni]]
|